11-08-2025 01:37:04 AM
- ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన ప్రధాని మోదీ
- బెంగళూరులో వందేభారత్ రైళ్లు ప్రారంభం, మెట్రో మూడో ఫేజ్ పనులకు శంకుస్థాపన
బెంగళూరు, ఆగస్టు 10: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బెంగళూరులోని కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్‌లో మూడు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. రైళ్లు ప్రారంభించిన అనంతరం రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. రూ. 15,160 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే బెంగళూరు మెట్రో మూడో ఫేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద పరోక్షంగా సెటైర్లు వేశారు.
డెడ్ ఎకానమీ వ్యాఖ్యలపై కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం భారత ఎకానమీ డెడ్ ఎకాన మీ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ పరోక్షంగా కౌంటఇచ్చా రు. బెంగళూరులో జరిగిన ఓ సభలో ఆయ న మాట్లాడారు. ‘ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవబోతుంది. సంస్కరణ, పనితీరు, పరివర్తన ద్వారా ఈ వే గం వచ్చింది. ఆర్థిక వ్యవస్థ వేగానికి ప్రభు త్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. 2014లో కేవలం ఐదు నగరాల్లోనే మెట్రో సేవలుండే వి. కానీ నేడు దేశవ్యాప్తంగా 24 నగరాల్లో 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ మెట్రో నెట్‌వర్క్ ఉంది. 2014కు ముందు కేవలం 20 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు మాత్రమే వి ద్యుద్దీకరించబడి ఉండేవి. కానీ ప్రస్తుతం 40 వేల కిలోమీటర్ల పైచిలుకు రైలు లైన్లు విద్యుద్దీకరించబడ్డాయి’ అని పేర్కొన్నారు.