calender_icon.png 23 May, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటలు దాటుతున్న ట్రంప్ మాటలు

22-05-2025 01:20:52 AM

క్లింటన్ పై నారాయణన్ చేసిన వ్యాఖ్యలను నాడు అనేక అమెరికన్ పత్రికలు ప్ర ముఖంగా ప్రచురించాయి. ‘క్లింటన్‌ను మందలించిన నారాయణన్’ అనే శీర్షికతో ‘వా షింగ్టన్ టైమ్స్’ ప్రచురించిన కథనం నాడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మళ్లీ వర్తమానంలోకి వస్తే.. పహల్గాంలో ఉగ్రమూకల మారణకాండ తర్వాత భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. 

పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని, కాల్పులు విరమించ కుంటే రెండు దేశాలకు అమెరికాతో వాణిజ్య సంబంధాలు రద్దవుతాయని హెచ్చరించానని, అందుకే రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఢంకా బజాయించి చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ దూకుడికి కళ్లెం వేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దారుణంగా విఫలమయ్యారనే చెప్పాలి.

ఈ సందర్భంగా పాతికేండ్ల క్రితం జరిగిన ఓ సందర్భాన్ని, చారిత్రక ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకోవడం సందర్భోచితం. బిల్‌క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కశ్మీర్ పైన అభ్యంతరకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిని అప్పటి భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ దీటుగా ఎదుర్కొని క్లింటన్ నోరుమూయించారు.

క్లింటన్ ఏమన్నారంటే..

2000 మార్చి 21న నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భారత రాజధాని ఢిల్లీకి విచ్చేశారు. ఆయన గౌరవార్థం నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి భ వన్‌లో విందు ఏర్పాటు చేశారు. అంతకుమునుపే బిల్‌క్లింటన్ ‘కశ్మీర్ అణుబాంబు ల కేంద్రం. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం’ అని వ్యాఖ్యలు చేయగా, రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విందు సందర్భంగా ఆ వ్యాఖ్యలపై చర్చ లేవనెత్తారు.

‘ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారు, ప్రజలు భీతిల్లేలా ఆ వ్యాఖ్యలు చేసేవారు, హింస లో మునిగి తేలాలని అనుకునే వారికి, శాంతిని విచ్ఛిన్నం చేయాలనుకునేవారికి మీ వ్యాఖ్యలు ప్రోత్సహంగా ఉంటాయి’ అంటూ కేఆర్ నారాయణన్ పాకిస్థాన్ ఉ ద్దేశించి నిర్దంద్వంగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ‘అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ముందుగా ప్రకటించింది మేము కాదు. కాబట్టి మా వైపు నుంచి ఎవరికీ ఎ లాంటి ప్రమాదమూ జరగదు. అలా నిబద్ధత ఉండేవారిని నిరాకరించే శక్తులనుంచే అలాంటి ప్రమాదం ఉంటుంది’ అంటూ కేఆర్ నారాయణన్ ఘాటుగా బిల్‌క్లింటన్‌కు కౌంటర్ ఇచ్చారు.

మీడియాలో విస్తృత కథనాలు..

క్లింటన్ పై నారాయణన్ చేసిన వ్యాఖ్యలను నాడు అనేక అమెరికన్ పత్రికలు ప్ర ముఖంగా ప్రచురించాయి. ‘క్లింటన్‌ను మందలించిన నారాయణన్’ అనే శీర్షికతో ‘వాషింగ్టన్ టైమ్స్’ ప్రచురించిన కథనం నాడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మళ్లీ వర్తమానంలోకి వస్తే.. పహ ల్గాంలో ఉగ్రమూకల మారణకాండ త ర్వాత భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది.

ఆపరేషన్ మొదలైన మూడురోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ఊహాతీ తంగా, ‘భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ’ అంటూ తనే ముందు ప్రకటించా రు. ‘అలా ఎందుకు చేశారు?’ అని ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గాని, అటు ప్ర ధాని నరేంద్ర మోదీగాని నిలదీసిన పాపా న పోలేదు. చారిత్రకంగా శాంతికాముక దేశం భారత్. పాకిస్థాన్ పుట్టుకతోనే ఉగ్రవాద దేశం.

అలాంటప్పుడు ట్రంప్ ఈ రెండు దేశాలనూ కలిపి ఒకే గాటన కట్టడం ఏంటి? ట్రంప్ ప్రకటన భారత దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉగ్రవాదా నికి కేరాఫ్ పాకిస్థాన్‌కు అనాది నుంచి పే రుంది. ఏ రంగంలో చూసినా పాక్‌పై  భా రత్‌దే పైచేయి. అలాంటి భారత్‌ను అమెరికా అధ్యక్షుడు పాక్‌ను చూసినట్టే చూడ డం దురదృష్టకరం. దీనిని ఖండించేంత ధైర్యం భారత ప్రధాని మోదీకి లేక పో యింది. కాల్పుల విరమణ కు రెండు దేశా లు అంగీకరించాయని విదేశాంగ కా ర్యదర్శి మిస్రీ చెప్పడానికి ముందే.. ట్రంప్ ఆ ప్రకటన చేసి ఉన్నారు.

కాల్పుల విరమణ కు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు భారత్, పాక్‌తో కలిసి పనిచేస్తానని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రి, తాత్కాలిక జాతీయ భ ద్రతా సలహాదారు మార్కో రుబియో మ రో అడుగు ముందుకు వేసి చర్చలు ప్రా రంభించేందుకు భారత్, పాక్ అంగీకరించాయని కూడా స్పష్టం చేశారు.

ఈ ప్రకట న వెలువడిన వెంటనే మన ప్రధాని మోదీ రంగంలోకి దిగి మార్కో  రుబియో ప్రకటనను, ట్రంప్ ప్రకటనను గట్టిగా ఖండించి ఉంటే మన దేశ గౌరవం నిలబడి ఉండేది. మోదీకి ఉన్న లక్షణం ఏంటంటే.. అనవసర సమయంలో ఆయన అవసరానికంటే ఎక్కువ మాట్లాడతారు. అవసరమైన సమయంలో మిన్నకుంటారు.  

గతంలోనూ మోదీ అంతే..

ప్రధాని మోదీ ఇప్పుడే కాదు గతంలోనూ ఆయన వైఖరి అంతే. అక్రమ వలసదారులంటూ అమెరికా వందలాది మందిని, సైనిక విమానంలో కుక్కి ఇండియాకి పంపించినప్పుడు కూడా మోదీ నుంచి ఎలాంటి స్పందన లేదు. మోదీతో పోలిస్తే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మేలు. దేశం అంత సంక్షోభ సమయంలో ఉన్నప్పటికీ, తన దేశ పౌరుల అవసరాలు తీర్చేందుకు ట్రంప్‌ను ప్రపంచ మీడియా ముందు ధిక్కరించి మాట్లాడారు. 

దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లినప్పుడు మనం ఏం చేయాలో కూడా అమెరికానే నిర్ణయించడం దేశ పౌరులను ఇబ్బంది పెట్టే అంశం. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ట్రంప్ గట్టిగా ఖండించిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ముష్కరులను ఒక్కమాటైనా అనలేదు. మోదీ ఏం చేసినా, ఏం మాట్లాడినా గుడ్డిగా సమర్థించే  సంస్థలూ వ్యక్తులు కూడా మోదీ వైఖరిని తప్పుపట్టినట్లు తెలిసింది.

ట్రంప్ వ్యాఖ్యలను ఆయా వర్గాలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాయి. పాతిక సంవత్సరాల క్రితం బిల్‌క్లింటన్ చేసిన ప్రకటనను నాటి రాష్ట్రపతి నారాయణన్ ఖండించిన తీరు భారత ఆత్మగౌరవానికి ప్రతీక.

ట్రంప్ మధ్యవర్తిత్వంపై ఇటీవల కేఆర్ నారాయణ్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన ఎస్‌ఎన్ సాహూ స్పందిస్తూ.. ‘కశ్మీర్ ద్వుపాక్షిక సమస్య అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి చెబుతున్నారే కానీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రధాని మోదీ ఏ మాత్రం ధైర్యం ప్రదర్శించడం లేదు’ అని మొహమాటం లేకుండా విమర్శించారు కూడా. 

వాసకర్త సెల్‌నంబర్ 98493 28496