calender_icon.png 6 May, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండాడితో తలపడే సునామీ రైడర్స్

06-05-2025 12:46:48 AM

ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న తాజాచిత్రం ‘మండాడి’. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు సూరి ప్రధాన పాత్రలో కనిపించనుండగా, కథానాయికగా మహిమా నంబియార్ నటిస్తోంది.

సుహాస్ ఈ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్నారు. నిర్మాతలు తాజాగా సుహాస్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ‘సునామీ రైడర్స్’ బృందంతో సముద్రతీరంలో నిల్చోని ఉన్న సుహాస్ అవతార్ ఆకట్టుకుంటోంది. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ స్వయంగా పడవలు నడుపుతూ ఒకరికొకరు వ్యతిరేకంగా కనిపించడం సినిమాలో వారి మధ్య జరిగే గట్టి పోరును సూచిస్తోంది.

సుహాస్ ఈ చిత్రంలో బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇంకా ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రీడా నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని బలమైన భావోద్వేగాలు, సంకర్షణలతో కూడిన ఈ సినిమా జీవన పోరాటం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఉంది.