06-05-2025 12:48:18 AM
శ్రీవిష్ణు హీరోగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘సింగిల్’. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. కేతికశర్మ, ఇవానా కథానాయికలుగా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ రాజు విలేకరులతో సినిమా విశేషా లను పంచుకున్నారు. “-కోవిడ్ సమయంలో ఈ కథను శ్రీవిష్ణుకు చెప్పా. తర్వాత 2023లో ఇదే కథను గీతాఆర్ట్స్‌లో చెప్పా. వాళ్లకు చాలా నచ్చింది. అలా ఈ సినిమా జర్నీ ప్రారంభమైంది. సినిమా లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్‌కు కూడా చాలా ప్రాధాన్యం ఉంది. కథలో 90 శాతం వరకు ఆయన పాత్ర ఉంటుంది.
నేను కథ రాసుకున్నప్పుడు డైలాగ్స్ తమిళ్ స్టుల్‌లో ఉన్నాయి. వాటిని భాను నందు తెలుగుకు తగ్గట్టుగా చాలా ఫన్‌ఫుల్‌గా రాశారు. -శ్రీ విష్ణు డబ్బింగ్‌లో చాలా ఫన్ యాడ్ చేశారు. స్క్రిప్టు లో ఉన్నది 60 శాతమైతే ఆయన 100 శాతం ఎలివేట్ చేశారు. -ఇది వెరీ సెంటిమెంటల్ స్టోరీ. రాజేంద్రప్రసాద్‌తో వచ్చే సీక్వెన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.
మొతంగా వినోదానికి భావోద్వేగాలు తోడైన సినిమా ఇది. ఒక తమిళ్ డైరెక్టర్‌గా తెలుగులో సినిమా చేయడం ఎలాం టి ఇబ్బందీ అనిపించలేదు. ఇక్కడ ఆర్టిస్టులందరూ చక్కగా తమిళ్ మాట్లాడుతారు. నాకూ తెలుగు అర్థమవుతుంది. మా నాన్న తెలుగేవాడే.. తమిళనాడులో సెటిల్ అయ్యాం. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచనైతే ఉంది. శ్రీవిష్ణు కోసం నా దగ్గర మరో రెండుమూడు కథలున్నాయి. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ టైమింగ్ నాకు ఇష్టం. ఆయనతో మళ్లీమళ్లీ కలిసి పనిచేయాలనుంది” అన్నారు.