11-08-2024 11:58:57 AM
కర్నాటక: తాత్కాలికంగా తుంగభద్ర డ్యామ్ నీటి వృథా కట్టడికి కాసేపట్లో నిపుణుల బృందం చేరుకోనుంది. ఐరన్ షీట్ల ద్వారా నీటి వృథా అరికట్టడంపై నిపుణులు పరిశీలించనున్నారు. వరద ఎక్కువగా ఉండటంతో మరమ్మతులకు ఆటంకం కలిగింది. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. అధికారులు రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీలు ఖాళీ చేయనున్నారు. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేశాక కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశముంది. కర్నాటక షిమోగలో వర్షాలకు తుంగభద్ర బ్యామ్ కు వరద నీరు చేరింది. తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద నీరు చేరింది.
వరదలకు తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19 గేటు కొట్టుకుపోయింది. రాత్రి నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయింది. తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు వృథాగా పోనుంది. కొట్టుకుపోయిన గేటు నుంచి 75 వేల క్యూసెక్కులు వృథాగా పోతుంది. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్ల నుంచి నీటి విడుదల చేశారు. కొట్టుకుపోయిన గేటు సహా 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీటి వృథా అయింది.