14-09-2025 01:23:24 AM
మేడ్చల్/గచ్చిబౌలి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): కూకట్‌పల్లి స్వాన్ లేక్ అపార్ట్ మెంట్ ఫ్లాట్‌లోనే హత్యకు గురైన మహిళ కేసును సైబరా బాద్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో ప్రమేయం ఉన్న ఇద్దరు పనిమనుషులు, వారికి సహాయం చేసిన మరో వ్యక్తిని జార్ఖండ్‌లోని రాంచీలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.
కేసుకు సం బందించిన వివరాలను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడిస్తూ నిందితులు హర్ష కుమార్ (20), రోషన్ సింగ్ (22), రాజు వర్మ (19) రాంచీకి చెందినవారు. వీరి లో హర్ష కుమార్ మృతురాలి ఇంట్లో, రోష న్ అదే అపార్ట్మెంట్ 14వ అంతస్తు ఫ్లాట్లో పనిమనిషిగా పనిచేస్తుండేవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరూ రేణుక అగర్వాల్ కుటుంబం కదలికలను గమనించసాగారు.
సెప్టెంబర్ 10న భర్త, కుమారుడు లేని సమయంలో రేణుకపై దా డి చేసి చేతులు కాళ్లు కట్టి గొం తు కోసి హత్య చేశారు. అనంతరం బంగారు ఆభరణాలు, నగదు, గడియారాలు, రోల్డ్ గోల్డ్ వస్తువులు దోచుకుని రాంచీకి పారిపోయి రాజు వర్మ వద్ద ఆశ్రయం పొందారు. సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు సీసీఎస్, ఎస్‌ఓటీ, స్థానిక పోలీసుల బృందాలతో రాంచీలో పట్టుకున్నారు.
విచారణలో నిందితులు నేరాన్ని ఒప్పుకుని దోపి డీ చేసిన వస్తువులు చూపించారు. రోషన్ సి్ంప రాంచీలో 2023లో హత్యాయత్నం, దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన వస్తువుల్లో బంగారు ఆభరణాలు, 16 గడియారాలు, రెండు మొబైల్ ఫోన్లు, ఫ్లాట్ తాళాలు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు ఉన్నట్లు సీపీ అవినాష్ మహంతి తెలిపారు.