calender_icon.png 14 September, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి డిక్లరేషన్‌లో గౌడ్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

14-09-2025 01:25:38 AM

తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ

ఖైరతాబాద్, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి) : కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు  ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కన్వీనర్ ఆయిలి వెంకన్న గౌడ్ సంయుక్త ఆధ్వర్యంలో కామరెడ్డి బీసీ డిక్లరేషన్ - కాంగ్రెస్ గౌడ్స్ కిచ్చిన హామీ అమలు పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ టి చిరం జీవిలు,ఓబిసి బిజెపి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గందమల్ల ఆనంద్ గౌడ్ లు హాజరై మాట్లాడారు ... కామారెడ్డి డిక్లరేషన్లు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను బేషరతుగా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే గౌడ కల్లుగీత సొసైటీలకు 25% వైన్సులను కేటాయించాలని అన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును  నామకరణం చేయాలని అన్నారు.

తాడిచెట్లకు పైనుంచి పడి మరణించిన, శాశ్వత వికలాంగులైన వారికి పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అన్నారు. చెట్ల పెంపకానికి ప్రభుత్వం సహకారం అందించడంతోపాటు ఐదు ఎకరాల భూమిని కల్లు గీత సొసైటీలకు ఇవ్వాలని అన్నారు. పెండిం గ్లో ఉన్న 13 కోట్ల 95 లక్షల రూపాయ లను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కళ్ళు గీత కార్పొరేషన్కు నిధులు కేటాయించి, గౌడ యువతకు ఉపాధిని అందించాలని కోరా రు.

బీసీ బంద్‌లో భాగంగా గౌడ కులస్తులను అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ సం దర్భంగా తీర్మానించారు. లేనిపక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ చైర్మన్ యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్,రాష్ట్ర అధ్యక్షులు గౌడ ఐక్యసాధన సమితి అంబాల నారాయణ గౌడ్. బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎస్. దుర్గయ్య గౌడ్,యువ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్, రెస్టారెంట్ , బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ గౌడ్,తాళ్ళ శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.