27-01-2026 12:01:52 AM
ఎల్లారెడ్డి, జనవరి 26(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డి నుండి జిల్లాస్థాయిలో ఉత్తమ ఉద్యోగులుగా డాక్టర్ బి గంగారెడ్డి, వాణిజ్యశాస్త్ర ఉపన్యాసకులు మరియు టి రవీందర్, జూనియర్ అసిస్టెంట్ లు ఎంపికయ్యారు. అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ లక్ష్మీ నారాయణ తెలిపారు. సోమవారం వారిద్దరూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ మరియు రాజేష్ చంద్ర జిల్లా ఐపీఎస్ అధికారులచేతుల మీదుగా అప్రిషియేషన్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం ఇద్దరిని అభినందించారు.