27-01-2026 12:00:17 AM
ఎల్లారెడ్డి జనవరి 26 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఆర్ డిఓ పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డి ఆర్డిఓగా సక్రమంగా విధులు నిర్వహించి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో సేవలు అందించినందుకు ప్రభుత్వం అభినందించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అదనపు కలెక్టర్ చేతుల మీదుగా ఆర్డిఓ పార్థసింహారెడ్డికి తాసిల్దార్ ప్రేమ్ కుమార్ కు ఉత్తమ అధికారులుగా అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.
వారితో పాటు ఎల్లారెడ్డి మండలంలోని డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఎల్లారెడ్డి మండలంలోని శివాపూర్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి సుజాత మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అటెండర్ సునీత ఆర్డిఓ కార్యాలయంలో దాటా ఎంట్రీ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఎల్లారెడ్డి మండలంలోని పలు శాఖలలో విధులు నిర్వహిస్తున్న పలు అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అగరపు కలెక్టర్ జిల్లా ఇన్చార్జ్ నాయకుల చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ప్రశంస పత్రాలు పొందారు. ప్రజలకు సేవ చేసిన భాగ్యమే మాకు ఎంతో గొప్ప ఈ ప్రశంస పత్రం అని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.