14-09-2025 12:00:00 AM
తమిళ ప్రజల్లాగే తెలుగువారూ సినీప్రియులే. ఇది కోలీవుడ్‌కు తెలిసిన ముచ్చటే. అందుకే ఏపీలో ప్రధానంగా జరుపుకొనే సంక్రాంతి పండగను క్యాష్ చేసుకు నేందుకు తమిళ్ మేకర్స్ ఎప్పుడూ ముందుంటున్నారు. తమ సినిమాలనూ తెలుగు సినిమాలతోపాటే వదులటం ఆనవాయి తీగా మార్చుకున్నారు. అయితే, ఈసారి పండ క్కి కోలీవుడ్ నుంచి రెండు సినిమాలు బరిలో నిలువనున్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ‘జననాయగన్’ సంక్రాంతికి రానుంది. జనవరి 9న విడుదల కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథా నాయిక కాగా, మమిత బైజు కూడా ఇందులో భాగమవుతోంది. శ్రుతిహాసన్ అతిథి పాత్రలో అలరించనుంది. బాబీ డియోల్, ప్రియమణి, గౌతమ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
రాజకీయ పార్టీని స్థాపించిన హీరో విజయ్ ఇదే తన చివరి చిత్రంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవల ‘మదరాసి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు తమిళ్ స్టార్ శివ కార్తికేయన్. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న మరోచిత్రం ‘పరా
శక్తి’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. శివకార్తికేయన్ నటిస్తున్న 25వ సినిమా ఇది. అంటే ఆయన సినీ కెరీర్‌లో మైలురాయి చిత్రం.
దీంతో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. తాజాగా కథానాయకుడు శివకార్తికేయన్ ఎక్స్ వేదికగా ‘పరాశక్తి’ వచ్చే సంక్రాంతి ప్రత్యేకంగా జనవరి 14 థియేటర్లలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, రానా దగ్గుబాటి, అబ్బాస్, జయం రవి, ఆథర్వ మురళి, గురు సోమసుందరం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
పోటీ నుంచి తప్పుకున్న సూర్య ‘కరుప్పు’
డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ తాజాచిత్రం ‘కరుప్పు’. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్నారు. ప్రకటించి నప్పట్నుంచే భారీ అంచనాలేర్పడిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందని వార్తలు వచ్చాయి.
అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. అదే సమయంలో తమిళ హీరోలు దళపతి విజయ్ ‘జన నాయగన్’, శివకార్తికేయన్ ‘పరాశక్తి’ రిలీజ్ ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో సూర్య ‘కరుప్పు’ను వేసవి ప్రత్యేకంగా ఏప్రిల్‌లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా యోగిబాబు, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్‌రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.