calender_icon.png 14 September, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంతార చాప్టర్1లో దిల్జీత్ గీతం

14-09-2025 12:00:00 AM

డైరెక్టర్-, హీరో రిషబ్‌శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ మ్యూజిక్ ఆల్బమ్ కోసం యాక్టర్, సింగర్ దిల్జీత్ దోసాంజ్ చేతులు కలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దిల్జీత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. “బిగ్ బ్రదర్ రిషబ్ శెట్టి మాస్టర్ పీస్ కాంతారను రూపొందించినందుకు సెల్యూట్. ఈ సినిమాతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. వరాహ రూపం పాట థియేటర్లలో చూసినప్పుడు ఆనందంతో ఏడ్చాను.

అజనీష్ లోక్‌నాథ్‌కు కృతజ్ఞతలు. ఒక రోజులోనే తన నుంచి చాలా నేర్చుకున్నాను” అని పేర్కొన్నారు. రిషబ్‌శెట్టి, దిల్జీత్ దోసాంజ్ కొలాబరేషన్.. ‘కాంతారా చాప్టర్1’పై అంచనాలు మరింతగా పెంచింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అర్వింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్ భాషల్లో అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.