26-12-2025 01:32:20 AM
చర్ల , డిసెంబర్ 25 (విజయక్రాంతి): చత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో రెండు ఐ ఈడీ బాంబులను భద్రతా దళాలు స్వాధీ నం చేసుకొని అక్కడికక్కడే ధ్వంసం చేశాయి. భద్రతా దళాలు నిర్వహిస్తున్న మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ సమయంలో ఎఫ్‌ఓబీ కండ్లపర్తి-2 నుంచి సీఆర్పీఎఫ్ 214 బెటాలియన్ బృందం ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ ప్రాం తంలో అమర్చబడిన 20, 5 కిలోల బరువు ఉన్న ఐఈడీ బాంబులను భద్రతా దళాలు కనుగొన్నాయి. వెంటనే వాటిని స్వాధీనం చే సుకొని అక్కడిక్కడే ధ్వంసం చేశాయి. దీంతో పాటు, నల్ల టార్పాలిన్‌లో చుట్టబడిన కంటైనర్ నుంచి 110 కాటన్ బాంబులు (ప టాకులు) కూడా స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా దళాల అప్రమత్తతతో పెద్ద ప్రమా దం నుంచి పోలీసు బలగాలు తప్పించుకున్నాయి.