calender_icon.png 6 October, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పేషీలో ఉద్యోగం సాధించిన ఆర్మూరి శివకుమార్‌కు ఘన సన్మానం

06-10-2025 12:00:11 AM

కోరుట్ల:సెప్టెంబర్5(విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటిం చిన ఫలితాల్లో జగిత్యాల్ జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ఆణిముత్యం ఆర్మూరు శివకుమార్ తల్లిదండ్రులు భాగ్య - కీ‘శే‘శంకర్ గార్ల పెద్ద కుమారుడు శివకుమార్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని అత్యంత కీల కమైన మరియు ముఖ్యమంత్రి గారి ఆధ్వ ర్యం లో నడిచే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో సెక్షన్ ఆఫీసర్ గా ఉద్యోగం సా దించిన సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ఫిసరిస్ కమిటీ అధ్యక్షులు ఇట్యాల రాజేందర్ నివాసంలో ఆర్మూరి శివకుమార్ ను శా లువాలతో ఘనంగా సన్మానించారు.

ఈసందర్భంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖ రాలను అధిరోహించాలని శుభాకాంక్షలు తె లిపారు. ఈకార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తోకల రమేష్, పల్లికొండ స్వామి, ప్ర జాసంఘాల జేఏసీ నాయకులు పేట భా స్కర్, ఎలిశెట్టి గంగారెడ్డి, గంగపుత్ర సంఘ నాయకులు ఇల్లుటపు గంగానర్సయ్య, దేశవేణి మోహన్, అర్జున్, ఇట్యాల భూమయ్య, లక్ష్మీ నారాయణ,  తదితరులుపాల్గొన్నారు.