17-08-2025 12:54:29 AM
వివరాలు వెల్లడించిన ఎస్పీ
సూర్యాపేట ఆగస్ట్ 16 (విజయక్రాంతి) : సూర్యాపేట పట్టణంలోని సాయి సంతోషి జ్యువెలరీ షాపులో జులై 21న జరిగిన బంగారం చోరీ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వెల్లడించారు. షాపులో 2.5 కేజీల బంగారం, డబ్బులు చోరీ అయినట్లు షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు గత నెల 27న ఏ7 నిందితురాలైన యశోదను అరెస్టు చేసి 14 తులాల బంగా రం స్వాధీనం చేసుకున్నామన్నారు.
నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం ఏడుగురు కోసం పోలీసులు గాలిస్తున్నారన్నారు. నేపాల్ కు చెందిన ఏ1 ప్రకాష్ అనిల్ కుమార్, ఏ6 నిందితుడు అమర్ భట్‌లు, వెస్ట్ బెంగాల్ కు చెందిన దొంగలు ఉన్నట్లు గుర్తించాలన్నారు. దీనిలో భాగంగా వెస్ట్ బెంగాల్ రాష్ర్టం దక్షిన్ దినాజ్ పుర్ జిల్లా, స్కూల్ పరహ పోస్ట్, బికహర్ మండలం, తపన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ4 మాలిక్ మొల్ల అనే దొంగను ఈ నెల 11న అతని స్వగ్రామం భైహోర్‌లో అరెస్టు చేశామన్నా రు. అలాగే నేపాల్‌కు చెందిన ఏ6 నిందితుడు అమర్ భట్ ను ఖమ్మం పట్టణంలో అదుపులోకి తీసుకుని రూ.5 వేలు నగదు సీజ్ చేశామన్నారు, ఏ4 నిందితుడు మాలిక్ మోల్లాను అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు రూ.60 లక్షల విలువగల 554 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 87,500లు- నగదు స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్పీ తెలిపారు.
అతన్ని విచారించగా నేపాల్ కు చెందిన ఏ1 ప్రకాశ్ అనిల్ కుమార్, ఏ2 కడక్ సింగ్, ఆహ్లూవాలియ, ఏ3 పురన్ ప్రసాద్ జోషి, వెస్ట్ బెంగాల్, మల్దా జిల్లా కు చెందిన ఏ5 జషిముద్దీన్ లతో కలిసి సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడినట్లు మాలిక్ మోల్లా ఒప్పుకున్నాడన్నారు. దీంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామన్నారు. త్వరలో మిగిలిన నిందితులను పట్టుకుని సొత్తు రికవరీ చేస్తామ న్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన సిబ్బందికి రివార్డ్ ఇచ్చి అభినందించారు.