24-12-2025 12:07:02 AM
అపార్టుమెంట్ ఎస్టీపీ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ప్రమాదం
రామచంద్రాపురం(పటాన్‌చెరు), డిసెంబర్ 23: అపార్టుమెంట్‌లోని ఎస్టీపీ ట్యాంకులను శుభ్రం చేస్తూ, ఊపిరాడక ఇద్దరు ఆపరేటర్లు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో జరిగింది. సోమిత్ రుయిడాస్(22) కొల్లూరులోని బ్లాసమ్ హైట్స్ అపార్టుమెంట్‌లో ఎస్టీపీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనితో పాటు హరీష్‌సింగ్ కూడా పనిచేస్తున్నాడు. 22న రాత్రి వరకు ఎస్టీపీ ట్యాంకులోని నీటిని తొలగించిన అనంతరం ఇద్దరు ఆపరేటర్లు ట్యాంక్ శుభ్రపరిచేందుకు లోపలికి వెళ్లారు. వారికి ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరై, అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.