calender_icon.png 9 November, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు ఉగ్రవాదుల హతం

09-11-2025 01:19:21 AM

కశ్మీర్‌లో ‘పింపుల్ ఆపరేషన్’

జమ్ముకశ్మీర్, నవంబర్ 8 : జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరుగుతున్న పింపుల్ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చారు. ఈ మేరకు శనివారం భారత సైన్యం చినార్ కోర్ ఎక్స్‌లో పోస్టు చేసింది. సరిహద్దు రేఖ వెంబడి చొరబడుతున్నారన్న నిర్ధిష్ట నిఘా సమాచారం ఆధారంగా, శుక్రవారం కుప్వారాలోని కేరాన్ సెక్టార్‌లో భద్రతా సంస్థలు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి.

అప్రమత్తమైన దళాలు అనుమానాస్పద కదలికను గుర్తించాయి. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసి, ప్రతీకారం తీర్చుకున్నాయి