calender_icon.png 9 November, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిత సమస్యలను పరిష్కరించాలి

09-11-2025 01:24:12 AM

  1. విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 

ఢిల్లీలో కొన్నిగంటల విరామం తర్వాత విమాన సర్వీస్‌లు

న్యూఢిల్లీ, నవంబర్ 8: ఢిల్లీ, హైదరాబాద్ తదితర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో అనేక ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు ఆలస్యంగా నడిపించారు. శుక్రవా రం ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సమస్యలు ఎదురయ్యాయి. శనివారం హైదరాబాద్ విమానాశ్రయంతోపాటు అనేక చోట్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి.

ఈ సమస్యలపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంబంధిత అధికారులతో సమీక్షించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ, డీజీసీఏ, విమానాశ్రయ అధికారులతో చర్చిస్తున్నారు. సాంకేతిక లోపాలతో విమాన సర్వీసులు ఆలస్యం అవుతుండడంతో రామ్మోహన్‌నాయుడు తన మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు.

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు మధ్యాహ్నం నుంచి సాధారణ స్థితికి చేరుకున్నాయని ఢిల్లీ విమానాశ్రయ ఆపరేటర్ డీఏఎల్ తెలిపింది. అయితే, తాజా విమాన మార్పుల వివరాల కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సం ప్రదించాలని పేర్కొంది. ఇలాంటి సాంకేతిక సమస్యలు మున్ముందు రాకుండా ఉండాలంటే భారతదేశ ఆటోమేషన్ మెసేజ్ స్వి చ్చింగ్ వ్యవస్థ ను ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించాలని ఏఏఐకి ఏటీసీ గిల్ ఆఫ్ ఇండియా తెలిపింది.