11-02-2025 12:14:42 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్, నాసిరకమైన వస్తువులు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మనోజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని ప లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆ సందర్భంగా నిర్వాహకులు అ త్యంత ప్రమాదకారైన ఫుడ్ కలర్స్, మసాలా లు ఇతరత్రా నాసిరకమైన వస్తువులను వాడి ప్రజలకు వండి పెడుతున్నారని తద్వారా గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రమాదకరమైన కలర్స్ ఇతరత్రా నాశరక మైన వస్తువులను అక్కడికక్కడే పారబోసి వారు తయారు చేసిన ఫుడ్ శాంపిలను సేకరించి టెస్టుకు పంపారు. మరికొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులకు నోటీసులు జారీ చేశారు.
రిపోర్టుల ఆధారంగా చట్టపర మైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా హోటల్లు, టిఫిన్ బండ్లు, టీ దుకాణాలు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అతి క్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చ రించారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో కొందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు దుకాణాలు మూసి వెళ్లిపోవడం విశేషం.