10-12-2024 12:08:50 AM
అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన చిచ్చరపిడుగు
భువనేశ్వర్: చదరంగంలో భారత్ నుంచి మరో చిచ్చరపిడుగు దూసుకొచ్చాడు. ఒడిశా వేదికగా జరుగుతున్న కేఐటీటీ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నీలో ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల ఆరిత్ కపిల్.. అమెరికా చెస్ గ్రాండ్‌మాస్టర్ రాసెట్ జియాటినోవ్‌ను ఓడించి సంచ లనం సృష్టించాడు. సోమవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో ఆరిత్ 63 ఎత్తుల్లో జియాటినోవ్‌ను చిత్తు చేశాడు. తద్వారా భారత్ తరఫున క్లాసికల్ టైమ్ కంట్రోల్‌లో ఒక చెస్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అత్యం త పిన్న వయస్కుడిగా (9 ఏళ్ల 2 నెలల 18 రోజులు) ఆరిత్ చరిత్రకెక్కాడు.
ఓవరాల్ జాబితాలో ఆరిత్ మూడో స్థానంలో ఉన్నా డు. గతంలో భారత సంతతికి చెందిన సింగపూర్ కుర్రాడు అశ్వత్ కౌశిక్ (8 ఏళ్ల ఆరు నెలలు), సెర్బియాకు చెందిన లియోనిడ్ ఇవనోవిక్ (8 ఏళ్ల 11 నెలలు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. దుర్గాపూర్ వేదికగా జరగనున్న అండర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆరిత్ తన తర్వాతి చాలెంజ్‌ను ఎదుర్కోనున్నాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్ బోరిస్ సావ్‌చెంకో కేఐటీటీ టోర్నీ విజేతగా నిలిచాడు.