21-05-2025 12:05:03 AM
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్‌సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పా రు. బెంగళూరులో అద్భుతంగా నిర్మితమవుతున్న అండర్‌గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ నుంచి తెలంగాణ స్ఫూర్తి పొందుతోందని తెలిపారు. మంగళవారం విద్యుత్‌శాఖ అధికారు లతో కలిసి బెంగళూరులో డిప్యూటీ సీఎం పర్యటించారు.
నగరంలోని అండర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థపై అధ్యయనం చేశారు. మొదట కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్(కేపీటీసీఎల్), బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లు కంపెనీ లిమిటెడ్ (బెస్కోమ్) అధికారులతో కలిసి అండర్‌గ్రౌండ్ కరెంటు సప్లు ప్రాజెక్టుపై చర్చ లు జరిపారు. తర్వాత క్షేత్రస్థాయిలో అండర్‌గ్రౌండ్ కరెంటు సప్లు ప్రాజెక్టు పనితీరును స్వ యంగా పర్యవేక్షించారు.
సమావేశంలో కేటీపీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పాండే, బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డా.శివశంకర తదితర అధికా రులు కీలకమైన అంశాలను తెలంగాణ బృం దానికి వివరించారు. రాష్ట్రం నుంచి ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ డిఫ్యూటీ సీఎం వెంట ఉన్నారు.
బెంగళూరులో అండర్‌గ్రౌండ్ విద్యుత్
2018-19లో ప్రారంభమైన అండర్‌గ్రౌండ్ ప్రాజెక్టులో ఇప్పటివరకు 7,400 కి.మీ 11కేవీ ఓవర్‌హెడ్ లైన్లను, వేలాది కి.మీ లోటెన్షన్ (ఎల్టీ) లైన్లను అండర్‌గ్రౌండ్ (యూజీ) కేబుల్స్‌గా మారుస్తున్నామని కర్ణా టక అధికారులు తెలిపారు. ఈ సందర్భ ంగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండర్‌గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థపై అక్కడి అధికారులను అడిగి పలు సందేహాలు నివృత్తి చేసుకున్నారు.