calender_icon.png 16 October, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యాలయ ప్రారంభాన్ని అడ్డుకుంటాం

16-10-2025 02:37:11 AM

శామీర్ పేట్ , అక్టోబర్ 15(విజయ క్రాంతి): శామీర్ పేట్  సబ్ రిజిస్ట్రార్  కార్యాలయం ప్రారంభాన్ని అడ్డుకుంటామని మేడ్చల్ ఏ బ్లాక్ అధ్యక్షుడు కాంగ్రెస్ అద్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  అద్దె భవనంలో నడుస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఖాళీగా ఉన్న  మండల పరిషత్ భవనంలోకి మార్చటానికి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు.

ఈ ఉత్తర్వులను శామీర్ పేట్ సబ్ రిజిస్టర్ కు కూడా  అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సబ్ రిజిష్టర్ కార్యాలని ఎంపీడీవో కార్యాలయానికి తరలిస్తే మూడు చింతలపల్లి మున్సిపాలిటీ నుండి వచ్చే ప్రజలకు , అధికారులకు కూడా సౌకర్యకరంగా  ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఉత్తర్వులను  విరుద్ధంగా మరోచోట సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని, ఇది ప్రభుత్వ పాలనకు విరుద్ధమని ఆయన ద్వజమెత్తారు.

ప్రభుత్వ ఉత్తర్వులను దిక్కరించి శామీర్పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించి మరోచోట ఏర్పాటు చేసిన సంబందిత అధికారుల, కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని, ఇతర పార్టీల నాయకులను గాని సహించేది లేదని వారిపై లోకాయుక్త కోర్టులో తీవ్రమైన కేసులను పెడతానని, వారిని తాను వదిలే ప్రసక్తే లేదని, వారు తీవ్రమైన పరినామాలను ఎదుర్కోవలిపి ఉంటు ందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

గతంలో తాను మాజీ మంత్రి జానారెడ్డిపై కూడ కోర్టులో కేసు పెట్టానని ఆయన గుర్తు చేశారు. సంబందిత మంత్రికి కూడ ఇట్టి విషయమై వివరించానని చె ప్పారు. సంబందిత అధికారులు పునారాలోచన చేయాలని, జిల్లా అదనపు కలెక్టర్ రాదికాగుప్తను ఇట్టి విషయమై కార్యాలయంలో కలిశానని ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేఖంగా మరో భవనంలో సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఏలాంటి ఉత్తర్వులు రాలేదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో షామీర్పేట్ సొసైటీ డైరెక్టర్ బిక్షపతి, అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తునికి రమేష్, అలియాబాద్ మాజీ సర్పం కంఠం కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేష్ పాల్గొన్నారు..