15-05-2025 10:21:00 PM
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కొత్త వంతెన వద్ద గుర్తుతెలియని మృతదేహం లభించినట్టు సాగర్ ఎస్సై సంపత్ తెలిపారు. ఎస్సై నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి సమీపంలోని ఎడమవైపున సుమారు 40 సంవత్సరాల వయసు గలిగిన యువకుని మృతదేహం గుర్తించినట్లు స్థానికులు తెలిపిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మృతదేహం కనీసం మూడు రోజుల క్రితం నీటిలో పడినట్టుగా దాని కారణంగా గుర్తుపట్టలేని విధంగా తయారైందని ఎవరైనా గుర్తించిన వారు సాగర్ పోలీస్ స్టేషన్ ని సంప్రదించాలని ఆయన కోరారు.