calender_icon.png 16 May, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిక్షణలు ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని పెంచుతాయి..

15-05-2025 10:23:57 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల శిక్షణలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(District Collector Pravinya) సందర్శించి ఉపాధ్యాయులతో మమేకమయ్యారు. శిక్షణలు ఏ విధంగా జరుగుతున్నాయో జిల్లా విద్యాశాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిక్షణ పొందుతున్న వివిధ సబ్జెక్టులలో శిక్షణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయుల సమావేశపు హాలులలోకి ప్రవేశించి ఉపాధ్యాయులతో ముచ్చటించారు. శిక్షణలు ఎలా ఉన్నాయి? ఇంకా ఏమైనా నూతన పద్ధతులు, నూతన విషయాల పట్ల శిక్షణ అవసరము ఉందా అని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులందరూ అధునాతన బోధన పద్ధతులతో పాటు, 21వ శతాబ్దపు బోధన మెలకువలను కలిగి ఉండాలని, దానికోసము శిక్షణలు అవసరమని ఆమె తెలిపారు.

ప్రభుత్వము బైలింగ్వల్ ద్విభాష పాఠ్యపుస్తకాలను అందిస్తుందని, వాటి యొక్క అవసరము ఎలా ఉందని, వాటి ఉపయోగం ఎలా ఉందని, ఆమె ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులలో ఆంగ్లం నైపుణ్యాలు పెంచాలని, తరగతి గదిని డిజిటలైజ్ చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థుల యొక్క ప్రవర్తనలను గమనించి, వారికి నైతిక విలువల పెంపు పట్ల అవగాహన కల్పించాలని, మార్గదర్శనం చేయాలని ఆమె తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇంటర్ ఆక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ను ఉపయోగించి బోధన చేయాలని, ఉపాధ్యాయులు బోధనోపకరణాలను వాడటం ద్వారా విద్యార్థుల యొక్క అభ్యసనము సులువు అవుతుందని తెలిపారు.

గత మూడు రోజులుగా స్కిల్ స్టార్ కు ఇంటర్నేషనల్ పాఠశాలలో జరుగుతున్నటువంటి శిక్షణలలో సుమారు 470 మంది ఉపాధ్యాయులు గణితము, ఆంగ్లము, సాంఘిక శాస్త్రము, ఉర్దూ ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, మండల స్థాయి రిసోర్స్ పర్సన్ లకు శిక్షణ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి, గుణాత్మక విద్య సమన్వయకులు ఏ. శ్రీనివాస్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, సెంటర్ ఇన్చార్జిల, రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.