12-07-2025 06:37:50 PM
నాగారం: వరుణుడు కరుణించకపోవడంతో రైతన్నలు బిక్కుబిక్కుమంటూ రోడ్డున పడే పరిస్థితి, వ్యవసాయం చేసిన కలిసి రాకపోవడంతో నాగారం మండలం పస్తాల ఆవాస తండాలకు చెందిన తండా వాసులు ఇద్దరు ఎన్నో ఏండ్లుగా సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలో వ్యవసాయ భూములలో వేప చెట్లు ఉన్నచోట వేప కాయలను దగ్గరకు సమకూర్చి వాటిని గ్రామాల్లో దుకాణదారుల వద్ద డబ్బాకు 50 నుండి 60 రూపాయలకు అమ్ముతూ రోజువారీ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. పంట పొలాలలో వేప కాయల వాడకం వలన రసాయన, పురుగు మందుల వాడకం ఖర్చు తగ్గుతుంది. వేప కాయల కాషాయ వాడకం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మానవ మనుగడకు వేప చెట్లు ఎంతో ఆదర్శం అని అన్నారు.