12-07-2025 01:57:06 AM
జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూలై 11(విజయక్రాంతి) : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేష న్లపై 42 శాతం పెట్టడానికి ఆర్డినెన్స్ తీయడానికి మంత్రి వర్గం నిర్ణయించడం బీసీల పోరాట విజయం అని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణ య్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సం ఘం జాతీయ కన్వీనర్ గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
అన్ని వర్గాలను కలుపుకొని పోయేలా ప్రభుత్వం చొర వ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని నిలుపుకోవాలని, సుప్రీంకోర్టు, హై కోర్టులో కేవియట్ ఫైల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరా రు. సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ కృష్ణ, నాయకులు నీల వెంకటేష్ ముదిరాజ్, నారా యణ గౌడ్, సీ. రాజేందర్, అనంత య్య, అంజి, నంద గోపాల్, లింగయ్య యా దవ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.