12-07-2025 06:49:35 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాలిగాయం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy)ని మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకుడు రావుల రవిచందర్ రెడ్డి శనివారం పరామర్శించారు. హైదరాబాద్ అజిత్ నగర్ లోని ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి స్వగృహంలో కలిసిన రవి చందర్ రెడ్డి కాలి గాయం నుండి ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రవిచందర్ రెడ్డితో పాటు నాయకులు ఉమా మహేశ్వర రావు, ఏకాంబరం తదితరులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు.