calender_icon.png 13 July, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ బలగం

12-07-2025 06:40:27 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో నిన్నే శివమ్మ పెద్ద సోమయ్య దంపతుల కుమార్తెలు, కుమారుల భారీ బలగం శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దివంగత వెన్నె శివమ్మ పెద్ద సోమయ్య దంపతులకు 11 మంది సంతానం కాగా అందులో 8 మంది కుమార్తెలు, ముగ్గురు కుమారులు కాగా వారి రక్త సంబంధీకులు మొత్తం 232 మంది ఉండగా అందులో 24 మంది మరణించగా, మిగిలిన 208 మంది ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ‘వెన్నె’ బందు బలగమంతా ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, శివాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత స్వర్గస్తులైన తమ పూర్వీకుల సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.