26-01-2026 12:08:47 AM
కొత్తగూడెం, జనవరి 25, (విజయక్రాంతి ): కేంద్ర బొగ్గుగనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డికి ప్రకృతి హరిత దీక్షకురాలు ,నైనిక రజువా మొక్కను అందించింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోగల కొత్తగూడెం క్లబ్లో జరిగిన భారతీయ జనతాపార్టీ ఎన్నికల విజయ సంకల్ప సభకు కిషన్రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు రంగాకిరణ్ సహకారంతో నైనిక రజువా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మొక్కను అందచేసి, ప్రకృతి పరిరక్షణ కోసం హరితదీక్ష వ్యవస్థాపకులు,మన్ కీ బాత్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చే ప్రసంశలు లందుకున్న మొక్కల రాజశేఖర్ ఆధ్వర్యంలో తాను చేస్తున్న కృషిని మంత్రికి తెలియజేసింది. ఈ సందర్భంగా నైనిక రజువా ను కిషన్రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.
ఇలాంటి మంచి కార్యక్రమాలను మున్ముందు మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, కార్పొరేషన్ ఎన్నికల ఇన్చార్జి మార్తినేని ధర్మారావు, సీనియర్ నాయకులు విజయ్ చందర్ రెడ్డి, జివికె. మనోహర్, వాసుదేవరావు, గొడుగు శ్రీధర్, గుంపుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.