calender_icon.png 26 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిగర్ స్కేటింగ్‌లో అభిజిత్‌కు స్వర్ణం

26-01-2026 01:56:59 AM

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్

లేహ్, జనవరి 25 : లడాఖ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026లో యువ క్రీడాకారులు అదరగొడుతున్నారు. అద్భుతమైన ప్రదర్శలతో పత కాలు సాధిస్తున్నారు. తొలిసారి ఈ పోటీల్లో చోటు దక్కించుకున్న ఫిగర్ స్కేటింగ్‌లో కేరళకు చెందిన అభిజిత్ అమల్ రాజ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఫిగర్ స్కే టింగ్ తొలిసారి చేర్చబడినప్పటకీ ఎనిమిది రాష్ట్రాల నుంచి 23 మంది స్కేటర్లు పాల్గొన్నారు.

వీరిలో హర్యానా నుంచి అత్యధి కంగా ఎనిమిది మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, ఉత్తరాఖండ్ నుంచి నలుగురు ఉన్నారు. ఆసక్తికరంగా సాగిన ఈ పోటీల్లో అడ్వాన్సడ్ ఫిగర్ స్కేటింగ్ విభాగంలో అభిజిత్ అగ్రస్థానం లో నిలిచి బంగా రు పతకం సాధించాడు. గతంలో 2019 వరల్డ్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2023, 2025 ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లోనూ,  2023 వరల్ స్కేట్ ఓషియా నియా అండ్ పసిఫిక్ కప్‌లో అభిజిత్ స్వర్ణ పతకాలు గెలిచారు. యువ స్కేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మరో స్కేటర్ వకాస్య లక్ష్మీ నారాయణన్త్‌తో కలిసి అకాడమిని కూడా స్థాపించాడు.