26-01-2026 01:50:57 AM
హైదరాబాద్, జనవరి 25:అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(ఏఐఎస్ జీఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడిగా టీఎన్జీవో సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్య వర్గ సభ్యులుగా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గుల సమాఖ్య 18వ జాతీయ సమావేశాలు మహారాష్ట్ర లోని షిరిడీలో జనవరి 23 నుం చి 26 వరకు దేశంలోని 28 రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు.
దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమ స్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని చెప్పి తీర్మానిం చారు. సమావేశాలు జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ, ప్రధాన కార్యదర్శి ఏ శ్రీకుమార్ నేతృత్వంలో జరిగాయి. అనం తరం జరిగిన ఎన్నికలలో తెలంగాణ ఎన్జీవో ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీ శ్వర్‌ని ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షు లుగా, కార్యవర్గ సభ్యులుగా టీఎన్జీవో ప్రధా న కార్యదర్శి ఎస్‌ఎం హుసేని ముజీబ్, అసో సియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటే శ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలం గాణ రాష్ట్రం నుంచి జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.