calender_icon.png 26 January, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాజాతర రథసారథులు

26-01-2026 01:53:40 AM

విజయంతం చేసేందుకు శ్రమిస్తున్న కలెక్టర్, ఎస్పీ

మహబూబాబాద్, విజయక్రాంతి: తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర నిర్వహణ కోసం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ తమ భుజస్కందాలపై వేసుకొని అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీ నిరంతరం మేడారంలోనే ఉంటూ పనులను పర్యవేక్షించారు. ఈనెల 19న మేడారం అభివృద్ధి పనులను, పునరుద్ధరించిన గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించే కార్యక్రమాన్ని, ఆ ఇద్దరు అధికారులు సవాల్‌గా తీ సుకున్నారు.

ఆ పని మాది కాదు.. ఇది మా శాఖ పరిధిలో లేదు.. మాకేం సంబంధం.. అలాంటి అంశాలకు తావు లేకుండా.. ప్రతి పని మేం చేసి తీరాల్సిందే అన్న పట్టుదలతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చివరకు కార్మికులతో కూడా సమన్వయంతో ముం దుకు సాగి ఇప్పటివరకు జాతర పనులన్నిం టినీ విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ పడిన కష్టాన్ని ప్రతి ఒక్క రూ అభినందిస్తున్నారు.

గత 20 రోజులుగా వీరిద్దరూ మేడారంలోనే మకాం వేసి, కంటి మీద కునుకు లేకుండా.. ఎలాంటి అభిప్రా య భేదాలు లేకుండా ‘సోదరుల’ వలె కలిసిమెలిసి ‘రథసారథు’లై మేడారం సమ్మ క్క సారలమ్మ మహా జాతర ను విజయ వంతం చేయడం వెనుక కృషి అనీర్వచీ యమని చెప్పాలి.

 బండి సంపత్ కుమార్, 

ఆ మూడు రోజులు సంక్లిష్టం

ఇప్పటివరకు మేడారం మహా జాతర నిర్వ హణ ఏర్పాట్లు, వసతుల కల్పన, పోలీసు బం దోబస్తు అంశాలన్నీ ఒక ఎత్తు అయితే, సమ్మక్క సారలమ్మ మహా జాతరలో ఈనెల 28,29,30  తేదీల్లో నిర్వహించే జాతర నిర్వహణ అత్యంత సంక్లిష్టం. 28న సారలమ్మ, 29న సమ్మక్క దేవ తలను గద్దె పైకి తీసుకురావడం, 30న కోట్లాది మంది భక్తులు మొక్కులు సమర్పించుకునే రోజు అత్యంత కీలకం. ఆ మూడు రోజులు సాఫీగా సాగితే.. మేడారం జాతర సంబరానికి ముగింపుగా భావిస్తారు. ఇదే తరహాలో జాతర మూడు రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని స్పష్ట కోటి ఆశాభా వం వ్యక్తం చేస్తున్నారు.