24-07-2024 12:26:55 PM
న్యూఢిల్లీ: సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని లోక్ సభలో కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో సింగరేణిపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటుపరం కోసం 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకమన్నారు. ఒడిశాలోని మైన్ ని సింగరేణికి కేటాయించామని కేంద్రమంత్రి గుర్తుచేశారు. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఆయన వెల్లడించారు.