26-08-2025 01:13:24 AM
బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్, ఆగస్ట్25)విజయక్రాంతి) బీసీలకు రిజర్వేషన్ విషయంలో వోట్ చోరీ విషయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ బిజెపి గూండాలతో పిసిసి అధ్యక్షుడి దిష్టి బొమ్మ దహనంచేపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు,సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.
జనహిత పాదయాత్ర సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం గంగాధర కూడలి వద్ద జరిగిన బహిరంగ సభలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా 42 శాతం బిసి రిజర్వేషన్ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వోట్ చోరీ విషయంలో కూడా అదే వైఖరి వ్యక్తం చేస్తున్నారని దేవుళ్లను పూజిస్తాం ప్రజలకిచ్చిన మాట నెరవేర్చుతాం కానీ బిజెపి నాయకులకు ఎన్నికలు వచ్చాయంటేనే దేవుళ్లు గుర్తొస్తారని అన్నారని వాస్తవం మాట్లాడితే తట్టుకోలేక బిజెపి నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పిసిసి అధ్యక్షుడి దిష్టి బొమ్మ దహనం చేశారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.
బిజెపి నాయకుల వైఖరిని ఖండిస్తూ బండి సంజయ్ కుమార్ దిష్టి బొమ్మను దహనం చేశామని నరేందర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో సమద్ నవాబ్ దన్న సింగ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి,దండి రవీందర్ వంగల విద్యా సాగర్,నెల్లి నరేష్,షభానా మహమ్మద్,పెద్దిగారి తిరుపతి,ముల్కల కవిత,గంగుల దిలీప్,కుర్ర పోచయ్య,యనమల మంజుల,జ్యోతి రెడ్డి,అస్తపురం తిరుమల,కీర్తి కుమార్,అష్రఫ్,ఫహాద్,జూపాక సుదర్శన్,బుర్ర నాగరాజు,మహమ్మద్ భారీ,మాసుం ఖాన్,బషీర్,విష్ణు వర్ధన్, ఆంజనేయులు,సాయిరాం,యోన తదితరులుపాల్గొన్నారు.