calender_icon.png 18 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యత అవసరం!

18-12-2025 12:00:00 AM

నేడు జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం :

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన  దేశం. పలు మతాలు, భాషలు, కులాలు, జాతులు, ప్రాంతాలతో నిండినది. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం భారత రాజ్యాంగ లక్ష్యం. దేశంలో మత, భాషా పరమైన మైనార్టీల హక్కుల రక్షణకు ప్రత్యేక చర్యలు  రా జ్యాంగం చెబుతుంది. ఈ నేపథ్యం లో భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 18న మైనారిటీ హక్కుల దినోత్స వాన్ని జరుపుకుంటారు. మైనారి టీలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.

వారి సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని మైనారిటీ హక్కుల దినోత్సవం గుర్తు చేస్తుంది. భారతదేశంలో 2013 నుంచి తొలిసారిగా మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటు న్నారు. 1992, డిసెంబర్ 18న ఐక్యరాజ్యసమితి ప్రకటనలో జాతి, మతప రమైన, భాషాపరమైన మైనారిటీలకు ప్రత్యేక హక్కులను ఆమో దించింది. భారత్‌లో రాజ్యాంగం ప్రకారం మైనారిటీలు అనే పదం లేదు.

వీరిని అల్పసంఖ్యాక వర్గాలుగా పేర్కొంటారు. మన దేశం లో మత, భాషాపరమైన మైనారిటీలు మాత్రమే ఉన్నారు. ముస్లిం లు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధు లు, పార్సీలు, జైనులను జాతీయ మైనారిటీ కమిషన్ మైనార్టీలుగా గుర్తించింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా మతాలు మానవత్వాన్ని, సమానత్వాన్ని బోధిస్తాయి. భారత రాజ్యాంగం ఏ మతాన్ని అధికారిక మతంగా ప్రకటించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలది ప్రత్యేకమైన సామాజిక, సాంస్కృతిక నేపథ్యం కలిగిన జీవన విధానం. చారిత్రకంగా బుద్ధిజం, సిక్కు మాత్రమే భారతదేశంలో పుట్టిన మతాలు.

ఇందులో బుద్ధిజం ప్రపంచ దేశాలకు కూడా విస్తరించింది. కానీ మన దగ్గర ఆదరణ లేక అంతరించిపోతుంది. భాష అనేది భావవ్యక్తీకరణకు పునాది. తమ సంస్కృతిలో భాగం. భారత రాజ్యాంగం ప్రకారం 18 భాషలు అధికారికంగా గుర్తించబడ్డాయి. భాషాపరమైన అల్ప సంఖ్యక వర్గాల్లో ప్రధానంగా కొన్ని ఆదివాసి గిరిజన తెగలున్నారు. ఈ వర్గాలు తమ భాషకు లిపి అనేది లేకుండా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భారతదేశంలో గత కొంతకాలంగా భాషాపరమైన ఆధిపత్యంపై వ్యతిరేకత మొదలైంది.

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘నూతన విద్యా విధానం-2020’ ప్రాంతీయ భాషలతో సంస్కృతానికి ప్రాధాన్యతనిచ్చింది. మరోవైపు ఉత్తర భారతదేశ హిందీని దక్షిణాన రుద్దాలనే ప్ర యత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు జాతీయ భాష గా హిందీని తెరపై తీసుకొస్తూ ప్రాంతీయ భాషల ప్రత్యేకతను దెబ్బతీయ డం ఆందోళన కలిగిస్తుంది. భారత ప్రభుత్వం జాతీయ మైనారిటీ కమిషన్‌ను 1992లో స్థాపించింది.

ఇది మైనారిటీల రాజ్యాంగ హక్కుల అమ లును పర్యవేక్షిస్తుంది. రాజ్యాంగంలోని అధికరణలు 29, 30 మైనారిటీలకు విద్య, సంస్కృతి, మతం లేదా భాష ఆధారంగా వివక్ష నుంచి స్వేచ్ఛ ను పొందే హక్కులను కల్పించాయి. ఆధిపత్య కుల రాజకీయాలతో మత, భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాలకు రక్షణ కరువవుతుంది. అంతిమంగా హక్కుల పరిరక్షణకు మైనార్టీలు ఐక్యంగా ఉండడం అవసరం.

  సంపతి రమేష్ మహరాజ్