18-11-2025 12:00:00 AM
నిజామాబాద్, నవంబర్ 17 :(విజయ క్రాంతి): సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో ఈ నెల 18న (మంగళవారం) యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎన్.వై.కే సమన్వయకర్త శైలి బెల్లాల్ తెలిపారు. ఉదయం 9.00 గంటలకు జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ చౌక్ నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ పాదయాత్ర శివాజీ చౌక్, ఫులాంగ్ చౌరస్తా, కోర్టు సర్కిల్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగుతుందని వివరించారు.
యూనిటీ మార్చ్ (పాదయాత్ర)లో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తోపాటు పలువురు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. యూనిటీ మార్చ్‌లో భాగస్వాములై దేశ ఐక్యతను చాటాలని కోరారు.