09-10-2025 12:27:00 AM
మొదటి విడత నామినేషన్లు నేటి నుండే...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 జెడ్‌పీటీసీ,311ఎంపీటీసీ
స్థానాలకు మొదటి విడతలో..
కరీంనగర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : బీసీల 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనాలు విన్న సీజే జస్టిస్ ఏకే సింగ్ ధర్మాసనం నేటి మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని తెలిపింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఈ నెల 9 న స్థానిక ఎన్నికలకు నోటీఫికేషన్ జారీపై పిటిషనర్ స్టే కోరాడంతో హైకోర్టు ఏమీ చెప్పకపోవడం తో యధావిధిగా గురివారం నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అయితే కోర్టు తీర్పు నేడు ఉండటంతోస్తానిక పోరు పై ఇంకా సస్పెన్షన్ మాత్రం కొనాసాగు తుంది. అక్టోబర్ 9వ తేదీ ఉదయం 10 : 30 గంటలకు ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
మొదటి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీకు ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 311 ఎంపీటీసీ స్థానాలకు.. 30 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 11వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. అక్టోబర్ 23వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది.
కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్, జమ్మికుంటా, వీణవంక , ఇళ్లందకుంటా, చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో జెడ్ పి టి సి స్థానాలు 70 ఎం పి టి సి స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. జగిత్యాల జిల్లాలో మూడు డివిజన్లో 20 మండలాలు ఉన్నాయి. మొదటి విడత ఎన్నికలు 10 మండలాలలో 108 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
బీర్పూర్ రాయికల్ ,సారంగాపూర్ ,ఇబ్రహీంపట్నం ,మల్లాపూర్ మెట్పల్లి ,భీమారం ,కథలాపూర్ , కోరుట్ల ,మేడిపల్లి మండలాలలో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.పెద్దపల్లి జిల్లాలో రామగుండం, మంథని, ధర్మపురి నియోజకవర్గాల్లోని అంతర్గాం, పాలకుర్తి, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్, ధర్మారం మండలాల్లోని 7 జడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, చందుర్తి, రడ్రంగి, ఇల్లంతకుంటా, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కొనరావుపేట మండలంలో 65 ఎం పి టి సి స్థానాల కు నామినేషన్లు స్వీకరిస్తారు.