09-10-2025 12:47:48 AM
-జెడ్పీటీసీ, ఎంపీటీసీ,సర్పంచ్ ఎన్నికల పైఅందరిలోనూ అనుమానాలు
-కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి..లీడర్లను ‘పైకి లేపుతున్న’ క్యాడర్
-ఇప్పటికే నేతల ఖర్చు తడిసిమోపెడు
కందుకూరు, అక్టోబర్ 9: స్థానిక ఎన్నికల పై రేపు హైకోర్టు తీర్పుపై ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. దీంతో అధికార పార్టీ నేతలు మాత్రం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచిస్తుండగా, ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం వేచి చూద్దామని దూరంలో ఉన్నారు. పలు రాజకీయ పార్టీల నేతలు ప్రజల్లోనూ సైతం కొంత అయోమయం నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈఎన్నికలు జరిగేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. పలువురు కోర్టుకు వెళ్లడంతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు,ప్రముఖులు, రాజకీయవేత్తలు,విశ్లేషకులు,ప్రజలు ఈ ఎన్నికలు ఈనెలలో జరిగేనా అనే అనుమానాలు పూర్తిస్థాయిలో వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జడ్పిటిసి, ఎంపీటీసీ,సర్పంచ్ స్థానాలకు ఆశావాహులు గ్రామాలలో ఇప్పటినుండే లాబీయింగ్ జరుపుతున్నారు. టికెట్ ఎవరికి వచ్చిన రాకున్నా తాను కచ్చితంగా నిలబడతానని గ్రామాలలో ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి అభ్యర్థిస్తూ వారిని మద్యం, డబ్బుతో సంతోషపరుస్తున్నట్లు తెలుస్తుంది.
ఖర్చు తడిసిమోపెడు
ఈ నేపథ్యంలో ఓటర్లు సైతం రాజకీయ పరంగా ఉన్న నాయకులను బోల్తా కొట్టించడానికి సైతం వెనకాడడం లేదని వార్తలు సైతం వస్తున్నాయి. మనకెందుకులే వారు పోటీ చేసి గెలుస్తారు తద్వారా మనల్ని పట్టించుకోరు వారి లాభాన్ని వారు అర్జిస్తున్నారు అని గ్రామాల్లో ఓటర్లు గుసగుసలాడుకుంటున్నారు.దసరా వేళ గ్రామాల్లో ప్రతి వర్గాలను ఆకట్టుకునే విధంగా దావతులు సైతం చేసినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు,విశ్లేషకులు పలు ఆశ్చర్యాలకు గురవుతున్నారు.ఎన్నికలు రాకముందే జడ్పిటిసి,ఎంపిటిసి స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీ చేసేవారు.ఇలాంటి ఖర్చులు పెట్టడం సరికాదని వారు సూచనలు చేస్తున్నారు.
ఫోర్త్ సిటీ ఎఫెక్ట్
మహేశ్వరం, కందుకూరు మండలాల పరిధిలో ముఖ్యంగా ఫోర్త్ సిటీ ఏర్పాటు వల్ల ఈప్రాంతాలు చాలా అభివృద్ధి చెందుతాయని దీనితో గ్రామాల్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలని ఉత్సాహం కనబరుస్తున్నారు. తమకు టికెట్టు వస్తే గెలిచి ఈప్రాంత అభివృద్ధితోపాటు తాము అభివృద్ధి చెందుతాము అని పోటీ చేసే అభ్యర్థులు భావజారాలు వ్యక్తం చేస్తున్నారని పలుఅనుమాలు సైతం వ్యక్తం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అభ్యర్థులు పోటీ చేసి గెలిస్తే తమకు ఎలాంటి లాభాపేక్ష ఉండదని ఓటర్లు సైతం హుందాగా వ్యవహరించి వారి డబ్బులకు సైతం ఆశ ఆశపడి హుందాగా వ్యవహరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాము గెలిచేందుకు ఎన్ని డబ్బులు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధమని కొందరి ద్వారా అభ్యర్థులు తెలియజేస్తుండడంతో ఓటర్లలో మరింత ఉత్సాహం పెరుగుతుందని తెలుస్తుంది.ఇప్పటికైనా పోటీ చేసే ఆశావహులు గ్రహించి గ్రామాలలో అభివృద్ధి చేయాలి తప్ప ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేయొద్దని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.