09-10-2025 12:04:26 AM
-యూకే ప్రధాని కిర్ స్మార్టర్ వెల్లడి
-రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇండియాకు రాక
-నేడు ప్రధాని మోదీతో భేటీ..
ముంబై, అక్టోబర్ 8 : ఇప్పటి వరకు జరగని విధంగా భారత్ దేశాల మధ్య కొత్తగా వాణ్యిజ్య ఒప్పందం కుదరనుందని యూకే ప్రధాని కిర్ స్మార్టర్ తెలిపారు. రెండు రోజుల అధికార పర్యటనలో భాగంగా స్మార్టర్ బుధవారం ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు స్మార్టర్ చేరుకున్నారు. ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌లు స్వాగతం పలికారు. రెండు రోజుల అధికారిక పర్యటలో భాగంగా బ్రిటీష్ ఎయిర్‌వేష్‌కు చెందిన 9100 విమానంలో స్మార్టర్ ఇండియాకు వచ్చారు.
అంతకుముందు స్మార్టర్ కాక్‌పిట్ నుంచి బ్రిటన్ ప్రయాణికులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు. ఈ క్రమంలో విమానంలోని కాక్‌పిట్ వద్దకు వెళ్లి ఇంటర్‌కామ్ ద్వారా స్మార్టర్ ప్రయాణికులతో మాట్లాడారు. ఇది ఎయిర్ సేఫ్టీ ప్రకటన కాదు.. కాక్‌పీట్‌లో ఉన్నది మీ ప్రధానమంత్రి స్మార్టర్. ప్రయాణికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరంతా విమానంలో ఉండడం అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఇప్పటి వరకు జరగని విధంగా భారత్ దేశాల మధ్య కొత్తగా వాణ్యిజ్య ఒప్పందం కుదరనుందని తెలిపారు.
మా కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోని అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు, మీతో కలిసి పనిచేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అందరూ ప్రయాణాన్ని ఆస్వాదించండి. తర్వాత మరి విషయాలను మీకు అందిస్తా థాంక్యూ. అని స్మార్టర్ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, స్మార్టర్‌లు గురువారం భేటీ కానున్నారు. భారత్ బ్రిటన్ స్వేచ్ఛా వాణజ్య ఒప్పందం(ఎఫ్‌టీయే)లో పదేళ్ల మార్గసూచీకి అనుగుణంగా వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.