calender_icon.png 2 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్మపల్లిలో ఉప్పరుల నామినేషన్‌లు తిరస్కరించాలి

02-12-2025 01:00:40 AM

  1. ఎస్సీ రిజర్వేషన్‌లో బిసి మహిళ నామినేషన్.?

సర్టిఫికెట్ ఎలా వచ్చిందని అనుమానాలు.?

నిమ్మపల్లిలో అక్రమంగా ఎస్సీ స్థానాల్లో పోటీ చేసిన వారిని తొలిగించాకే ఎన్నికలకు వెళ్ళాలి.

రిటర్నింగ్ అధికారికి పోటీ చేసిన అభ్యర్థుల పిర్యాదు

కోనరావుపేట,డిసెంబర్ 01(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావు పేట మండలం నిమ్మపల్లిగ్రామంలో ఉప్పరుల నామినేషన్ లు తిరస్కరించాలని,ఎస్సీ జనరల్ రిజర్వేషన్ స్థానంలో బిసి మహిళ ఎస్సీ సర్టిఫికెట్ తో నామినేషన్ వేసిందని, అసలు బిసి మహిళకు ఎస్సీ సర్టిఫికెట్ ఎలా వచ్చిందని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ స్థానంలో నామినేషన్ వేసిన ఉప్పరులను నూతన ఎస్సీ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతించాలని,లేని యెడల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని నిమ్మపల్లి ఎన్నికల అధికారికి,తహసీల్దార్ కు,వేములవాడ ఆర్డీఓ కు ఎస్సీ స్థానంలో పోటీచేసిన అభ్యర్థులు పిర్యాదు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి ఎస్సి మహిళ రిజర్వేషన్ రాగా అందులో ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మాదిగ,మాల సామాజిక వర్గం నుండి నామినేషన్ లు వేయగా వారితోపాటు నిమ్మపల్లి గ్రామానికి చెందిన ఉప్పర కులానికి చెందిన ఓ మహిళ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసింది.దానితోపాటు వార్డుల్లో 1వ,వార్డు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ లో ఎస్సిలు ఇద్దరు మాల,మాదిగ సామజిక వర్గం నుండి నామినేషన్ వేశారు. అదేవిదంగా ఉప్పర కులస్థులు ఇద్దరు నామినేషన్ వేశారు.

అదేవిదంగా 7వ, వార్డులో ఎస్సి మహిళ రిజర్వేషన్ లో ఉప్పర కులానికి చెందిన ఓ మహిళ పోటీ చేసింది. ఈవిదంగా ఎస్సి రిజర్వేషన్ స్థానంలో అక్రమంగా బిసి లైన ఉప్పర కులస్థులు పోటీ చేసి మాకు వచ్చే అన్ని లబ్ధిలాను పొంది మాకు అన్యాయం చేస్తున్నారని,గతంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నపుడు ఓటు బ్యాంక్ కోసం వారికి ఇచ్చిన పాత సర్టిఫికెట్ లు పెట్టి పోటీ చేశారాని,

ఎస్సీ స్థానాల్లో ఏబిసిడి వర్గీకరణ అయ్యాక వచ్చిన 2025 నూతన సర్టిఫికెట్ లు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, ఈ సమస్య పరిష్కరం అయ్యేవరకు ఎన్నికలు ఆపి, మూడో విడతలో నిర్వహించాలని ఎన్నికల అధికారికి, తహసీల్దార్, ఆర్డీఓ లకు పోటీదారులైన ఎస్సీ మాల, మాదిగ కుల అభ్యర్థులు విన్నవించుకున్నారు.

బిసి మహిళకు ఎస్సీ సర్టిఫికెట్ ఎలా వచ్చింది.?

నిమ్మపల్లి గ్రామానికి చెందిన ఉప్పర కులస్థునికి బంధువైన బిసి మహిళ గత కొన్ని సంవత్సరాలుగా నిమ్మపల్లి గ్రామంలో నివసిస్తున్నది.ఆమె అక్రమంగా 2025 ఆగస్టులో ఎస్సీ సర్టిఫికెట్ కోనరావుపేట తహశీల్దార్ నుండి పొందినది.బిసి కులానికి చెందిన ఆ మహిళ ప్రేమ వివాహం చేసుకొని తలదాచుకోవడానికి నిమ్మపల్లి రాగా భర్త చనిపోయాడు. అప్పటి నుండి కూలీ పని చేసుకుని జీవిస్తున్నది.

ఉప్పరులకు గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సి సర్టిపికట్ ఇవ్వకుండా నిలిపి వేయగా బిసి మహిళకు ఎలా ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చారని, ఎస్సీ జనరల్ వార్డులో ఆమె ఎలా పోటీ చేసిందని ఆ వార్డులో పోటీ చేసిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేశారు. అయితే బిసి మహిళకు ఎస్సీ సర్టిఫికెట్ ఎలా వచ్చిందని, ఆదికారులు,రాజకీయ నాయకుల సహకారం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.