23-08-2025 12:03:33 AM
యూరియా సరఫరాపై రైతుల సమక్షంలో చర్చకు సిద్ధం
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి
ఖమ్మం, ఆగష్టు 22 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని, కేంద్రంపై అసత్య ప్రచారాలు చేయవద్దని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొం డపల్లి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలోనిప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహజంగానే ఆగష్టు నెలలో యూరియా అవసరం ఎక్కువగా ఉం టుందన్నారు.
యూరియా కొరత ఉందని, అడిగినంత కేంద్రం సరఫరా చేయలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృత్రి మ కొరత సృష్టించడం వల్లనే యూరియా కొరత ఏర్పడిందన్నారు. గత ఖరీఫ్, రబీ సీజన్లో 12.47 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందని, 10.43 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారని అన్నారు.
2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్తో ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ప్రారంభమైందన్నారు. రాజకీయ దురుద్ధేశంతోనే విమర్శ లు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో గత ఏడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరగలేదని, యూరియా వాడకం మా త్రం 3 వేల టన్నులు అదనంగా విక్రయించారని వ్యవసాయాధికారులు చెబుతున్నారని అన్నారు.
ఈ యూరియా ఎక్కడుందని ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్లో ఉందా, లేక అవసరం ఉన్నా లేకపోయినా రైతులు కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా బ్లాక్ మార్కెట్, మాఫియా ఉంటుందన్నారు. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రించలేదన్నారు. రసాయనిక ధరలు పెరిగినా యూరియా బస్తాను రూ.266 రూపాయలకే కేంద్రం ఇస్తోందన్నారు.
2300 రూపాయల సబ్సిడీని కేంద్రం భరిస్తోందన్నారు. ఈ యూరియాను రాష్ట్ర ప్రభు త్వం సరఫరా చేయలేక చేతులెత్తేసి కేంద్రంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ 11 ఏండ్లలో యారియా కోసం రైతులు క్యూలో నిల్చున్న పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నచ్చిన జిల్లాలో, ప్రదేశంలో కేంద్రం చేసిన యూరియా సరఫరాపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
అవసరానికంటే ఎక్కువగా యూరియాను విక్రయించారా లేదా అన్నది తుమ్మల సమాధానం చెప్పాలన్నారు. మార్క్ఫె్ప ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. ప్రయివేట్ వ్యాపారులను నియంత్రించలేకపోయారని విమర్శించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, జిల్లా నాయకులు భూక్యా శ్యామ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్రెడ్డి, సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.