08-08-2025 12:00:00 AM
రైతులకు పింఛన్ పింఛన్ పథకం అన్నం పెట్టే రైతులు వయ స్సుడిగిన తర్వాత పింఛన్ పొందే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో తీసుకువచ్చిన ఈ పథకం రైతు లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. ఈ పథకంతో సన్న, చిన్నకారు రైతులకు ఆర్థిక భరోసాతో పాటు కుటుంబానికి ఆర్థిక భారం నుంచి కొంత వెసులుబాటు కలుగనుంది.
కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో అండగా నిలిచేందుకు పీఎం మాన్ ధన్ యోజనను ప్రవేశపెట్టింది. పథకం కింద రైతుకు 60 ఏళ్లు దాటాక ప్రతినెలా రూ.9 వేల చొప్పున జీవితకాలం పింఛన్ అందుతుంది. ఈ పథకంలో లబ్ధి పొందడానికి 18 - 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు అర్హులు. తమ పేరు మీద భూమి పట్టా ఉండి, ఐదెకరాల వరకు సాగయ్యే భూమి ఉన్నవారు ఈ పథ కంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఎప్పుడు పేరు నమోదు చేసుకున్నా 60 ఏళ్లు దాటాకే పింఛన్ వస్తుంది.
ఈ పథకంలో చేరే వారు వారి వయస్సును బట్టి నెలనెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతు చెల్లించిన ప్రీమియం డబ్బుతో సమాన డబ్బు కేంద్ర ప్రభుత్వం తన వంతుగా బీమా కంపెనీకి చెల్లిస్తున్నది. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన 18 నుంచి 40 ఏళ్ల రైతులు అర్హులు. ప్రీమియం రూ. 55 నుంచి రూ.200 బీమా కంపెనీకి రైతు ప్రీమియానికి సమానంగా ప్రభుత్వం చెల్లింపునుకు అనర్హులు. పథకంలో చేరడానికి 18- 40 ఏళ్లలోపు రైతులు అర్హులు.
పథకంలో చేరిన నాటి నుంచి ప్రతి నెలా రైతు అతడి వయస్సును బట్టి బీమా కంపెనీకి నిర్ణయించిన ప్రీమియం ప్రతి నెలా చెల్లించాలి. రైతు చెల్లించిన ప్రీమియానికి సమానంగా ప్రభుత్వం నగదు బీమా కంపెనీకి చెల్లిస్తున్నది. 18 ఏళ్ల రైతు నెలకు రూ.55 చొప్పున ప్రీమియం చెల్లించాలి. కేంద్ర దరఖాస్తు చేసుకోవాలి.
ఇలా పీఎం కిసాన్ లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి సీఎం కేఎంపై పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రైతు మొదట తన ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. పీఎం కిసాన్ పథకానికి నమోదైన బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి నెలా ఆటోమెటిక్‌గా ప్రీమియం డబ్బులు ఆ ఖాతా నుంచి పీఎంకేఎంవై పథకానికి జమవుతాయి. నామినీ వివరాలు నమోదు చేయాలి.
రాజయ్య, సిరిసిల్ల