calender_icon.png 11 January, 2026 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివలింగానికి పాలాభిషేకం

10-01-2026 09:03:01 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): రేకుర్తి 19వ డివిజన్ అమృతేశ్వర ఆలయంలో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి ఆధ్వర్యంలో హర హర మహాదేవ ఆలయంలో శివలింగానికి పాలాభిషేకం అర్చన నిర్వహించారు. గజని మహమ్మద్ 1026 సంవత్సరంలో సోమనాథ్ ఆలయం చిహ్నంపై దండయాత్ర చేసి అప్పటివరకు 1000 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 1000 సంవత్సరాలుగా సహనాన్ని పునర్జీవనాన్ని నిరంతరం ఒకేలా ఉండడాన్ని గుర్తుగా ఈరోజు సోమనాథ్ స్వామి స్వాభిమానపర్వంగా జరుపుకుంటున్నారని అన్నారు.

1951 మే 11 ఇప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సోమనాథ్ ఆలయాన్ని భక్తుల కోసం తెరిచారు. ఇట్టి సందర్భంగా శివలింగానికి అర్చన పాలాభిషేకం నిర్వహించామని అన్నారు. మహాదేవుడు భారతదేశ ప్రజలను ప్రపంచలోని ప్రజలను నిరంతరం కాపాడుతున్నాడని మానవులు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారని మానవులు వారి యొక్క కర్మ ఫలాలను అనుభవిస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొండపల్లి సతీష్, జిల్లా అధికార ప్రతినిధి సంకటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల రాము, గోదరి నరేష్, గంట్ల నరసింహారెడ్డి, నాంపల్లి శంకర్, ప్రతాప్ రెడ్డి, రాపెల్లి సంపత్,  దుర్గం మోహన్, కిషన్, కుమార్ పాల్గొన్నారు.