calender_icon.png 11 January, 2026 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారులకు భారీ నిధులు

10-01-2026 08:45:16 PM

ఎస్టీ తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.30 కోట్ల ట్రైబల్ వెల్ఫేర్ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రహదారి సదుపాయం లేని అన్‌కనెక్టెడ్ ఎస్టీ తండాలకు ఈ నిధులతో రోడ్డు సౌకర్యం కలగనుంది.

రోడ్ల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లను కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కథలాపూర్, కోనారావుపేట, రుద్రంగి మండలాల పరిధిలోని పలు తండాలు, గ్రామాలకు బీటీ రోడ్లు, సీసీ అప్రోచ్ రోడ్లు, హై లెవల్ వంతెనల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. రోడ్ల నిర్మాణంతో గిరిజన ప్రాంతాల్లో రవాణా మెరుగుపడడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.