10-01-2026 08:42:54 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మున్సిపాలిటీలోని గంపలపల్లికి చెందిన అగ్గు రమేష్ (32) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ శనివారం కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందాడని స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మృతునికి మానసిక పరిస్థితి బాగోలేక గత 10 సంవత్సరాల నుండి కరీంనగర్ లోని ప్రశాంతి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని మందులు వాడుతుండన్నారు.
మందులు వాడిన తన మానసిక పరిస్థితి బాగుపడలేదని గతంలో కూడా ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రిలో చికిత్స చేపించారు. అదే క్రమంలో ఈనెల 8న ఉత్కూర్ శివారులోని తన సొంత పొలంలో గడ్డి మందు తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకొన గా కుటుంబ సభ్యులకు మందు తాగిన విషయం చెప్పడంతో కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య అగ్గు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.