26-12-2025 02:16:22 AM
ఆమనగల్లు, డిసెంబర్ 25( విజయ క్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తండాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆమనగల్ మండలంలోని మేడిగడ్డ తండా, శంకర్ కొండ పంచాయతీల కుచెందిన పలువురు బిజెపి పార్టీకి చెందిన నాయకులు మాజీ సర్పంచ్ అంబర్ సింగ్, మాజీ ఎంపిటిసి పరమేష్ ఆధ్వర్యంలో భారీగా నాయకులు, కార్యకర్తలు హైదరాబాదుకు తరలివచ్చి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని పార్టీలోకి సాధారంగా పార్టీ లో కి ఆహ్వానించి పార్టీ కండువాను కప్పారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన బిజెపి పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన గుర్తు చేశారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పాత, కొత్త అనే తేడా లేకుండా పార్టీ ఆదేశాల మేరకు అందరూ సమన్వయంతో కలిసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం లో ఇటీవల జరిగిన స్థానికపోరు లో సర్పంచ్, వార్డు సభ్యులు మెజార్టీగా గెలుపొందారని అదే స్ఫూర్తితో వచ్చే పరిషత్ ఎన్నికల్లో కూడా కల్వకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ పోలేపల్లి నారాయణ, సర్పంచ్ మంగ్లీ రాములు, జిల్లా నాయకులు రవీందర్ నాయక్, సురేష్ పాల్గొన్నారు