calender_icon.png 22 December, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేం కలిసి చేసిన ఏ సినిమా ఫెయిల్ కాదు!

22-12-2025 02:11:06 AM

ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని డిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తోపాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీవాస్ విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.  

‘మిత్రమండలి’ ఫలితంలో ప్రేక్షకుల తీర్పును అంగీకరించాం: బన్నీ వాస్ 

“కంటెంట్ నచ్చితేనే తీసుకున్నాం.. సినిమా నచ్చకపోతే వెంటనే వాళ్లకు వేరే ప్రత్యామ్నాయ మార్గం చెబుతాం. ఈ సినిమా కంటెంట్ మీద నమ్మంతోనే అసోసియేట్ అయ్యాం. నా సొంత సినిమాల్లో ఫెయిల్ అయినా డిస్ట్రిబ్యూషన్స్‌లో ఫెయిల్ కాలేదు. ఈ సినిమా విషయంలో ఫెయిల్ కాను అనే నమ్మకం ఉంది. ‘మిత్రమండలి’ విషయంలో ప్రేక్షకుల తీర్పును అంగీకరించి మరుసటి రోజే ఆ సినిమా గురించి మరిచిపోయా. నేను వంశీ కలిసి చేసిన ఏ సినిమా కూడా ఫెయిల్ కాదనే నమ్మకం ఉంది. ‘ఈషా’ కూడా మా నమ్మకాన్ని నిలబెడుతుంది. ఈ మధ్య చిన్న సినిమాల పబ్లిసిటి చాలా ఇన్నోవేటింగ్‌గా చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే సినిమాలు ఆడుతున్నాయి”.   

మాదొక కొత్త ట్రెండ్: వంశీ నందిపాటి 

“మేము ఈ సినిమా ఎందుకు తీసుకున్నామో.. మొదటి పది నిమిషాల్లోనే అందరికి అర్థమవుతుంది. సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తిగా భయంగా ఉంటుంది. లిటిల్‌హార్ట్స్, రాజువెడ్స్ రాంబాయితో పోల్చకూడదు. ఈ రెండు సినిమాల విషయంలో మేం అనుకున్నదే జరిగింది. ‘ఈషా’ విషయంలోనూ అనుకున్నదే జరుగుతుంది. తొలి పదిహేను నిమిషాలు అదిరిపోతుంది. పతాక సన్నివేశాలు స్టనింగ్‌గా ఉంటాయి. ఇది కేవలం హారర్ సినిమానే కాదు అందరికి వర్కవుట్ అవుతుంది. దీనికి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు.

ఈ సినిమా చివరి 20 నిమిషాలు హారర్ సినిమాలా ఉండదు. ఓ మంచి విషయం చెప్పారని ఫీల్ అవుతారు. ఇప్పుడు మేము వెళుతున్న జర్నీ బెటర్.. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మా జడ్జిమెంట్ బాగుంటుంది. ఇది మా ఇద్దరికి బాగుంది. ఎడిట్ రూమ్ దగ్గర్నుంచీ మేము అనుకున్న మార్పులు చేసి.. సినిమాను ఓ ప్లానింగ్ ప్రకారం విడుదల చేస్తున్నాం. ఆర్‌ఆర్‌తోపాటు మ్యూజిక్‌లో కూడా ఇన్‌వాల్వ్ అవుతాం. సినిమాను మార్కెటింగ్ చేసి.. నాన్‌థియేట్రికల్‌ను కూడా  క్లోజ్ చేసి.. సినిమాలను విడుదల చేస్తున్నాం మాదొక కొత్త ట్రెండ్.. ఫిల్మ్‌ను ఓ స్ట్రాటజీ ప్రకారం విడుదల చేస్తున్నాం. ‘పొలిమేర-3’ ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఉంటుంది. ఏషియాన్ సునీల్, బీవీ వర్క్స్‌తో కలిసి ఈ సినిమా ఉంటుంది”.