calender_icon.png 9 August, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడ్డి మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య

09-08-2025 02:11:28 AM

బాన్సువాడ ఆగస్టు 8 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పులుపుచే తండా కు చెందిన కోల జెప్పి బాయి (62) వృద్ధురాలు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సిఐ అశోక్ తెలిపారు.సిఐ తెలిపిన వివరాలు ప్రకారం గత కొన్ని సంవత్సరాల నుండి మతిస్థిమితం కోల్పోయి ఇంట్లో ఎవరూ లేని సమయం లో గురువారం మధ్యాహ్నం సమయంలో పురుగుల మందు తాగి వాంతులు చేసుకొని ఇంట్లో ఉండగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆమె కుమారుడు కోల రాజేష్ పొలం నుండి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో గడ్డి మందు వాసన రావడంతో ఇంటి లోపలికి వెళ్లి చూడగా అక్కడ జెప్పి బాయి వాం తులు చేసుకొని ఉండగా ఆమె పక్కనే అతని కొడుకు గడ్డి మందు డబ్బా ఉండడం చూసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బాన్సువాడకు తరలించినాడు. ఆమెకు మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన గురువారం రాత్రి నిజాంబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు మృతురాలి కుమారుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  సిఐ అశోక్ తెలిపారు.