18-12-2025 12:58:35 AM
అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సొంతం
దుబాయి, డిసెంబర్ 17 : టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 ఫార్మాట్‌లో దూసుకెళుతున్నాడు. ఇప్పటికే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న వరుణ్ చక్రవర్తి తాజాగా అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. తాజాగా విడుదలైన జాబితాలో తన టాప్ ప్లేస్‌ను మరింత పటిష్టం చేసుకున్న వరుణ్ తన రేటింగ్ పాయింట్స్‌ను భారీగా మెరుగుపరుచుకున్నాడు. కెరీర్‌లోనే అత్యుత్తమంగా 818 రేటింగ్ పాయింట్లు సాధించి చరిత్ర సృష్టించాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఒక భారత బౌలర్ ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. 2017లో బుమ్రా 783 కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లతో ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి దానిని అధిగమించాడు. అంతేకాదు అత్యుత్తమ టీ20 రేటింగ్ పాయింట్లు సాధించిన టాప్ బౌలర్ల జాబితాలోనూ చో టు దక్కించుకున్నాడు. భారత్ నుంచి వరుణ్‌కు మాత్రమే ఈ ఘనత దక్కింది.
గత కొం తకాలంగా పొట్టి క్రికెట్‌లో అదరగొడుతున్న ఈ మిస్టరీ స్పిన్నర్ సెప్టెంబర్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు.2021 టీ20 ప్రపంచకప్‌లో అట్టర్‌ఫ్లాప్ అయిన వరుణ్ చక్రవర్తి తర్వాత భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్‌లో అదరగొట్టిన రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం భారత టీ20 టీమ్‌లో కీలక స్పినర్‌గా మారిపోయాడు.
ఈ ఏడాది ఇప్పటివరకూ 19 మ్యాచ్‌లలో 32 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా సిరీస్‌లోనూ అత్యుత్తమ ఎకానమీతో సత్తా చాటాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న డఫీకి, వరుణ్‌కు మధ్య 119 రేటింగ్ పా యింట్లు తేడా ఉండడంతో మరో 2 నెలల పాటు అతనే అగ్రస్థానంలో కొనసాగే ఛా న్సుంది. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా...తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగై నాలుగో ప్లేస్‌లో నిలిచాడు. పేలవ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 10వ స్థానానికి పడిపోయాడు.