18-12-2025 01:00:02 AM
నాలుగో టీ ట్వంటీ రద్దు
లక్నో, డిసెంబర్ 17 : సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవాలని ఎదురుచూస్తున్న భారత్ ఆశలకు పొగమంచు తాత్కాలికంగా అడ్డుపడింది. లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో టీ ట్వంటీ పొగమంచు కారణంగా రద్దయిం ది. సాయంత్రం 6 గంటల నుంచే స్టేడియంలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. రాత్రి అయ్యే కొద్దీ దాని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. దీంతో అంపైర్లు పలుమార్లు గ్రౌం డ్‌ను పరిశీలించారు.
బంతి కనిపించే అవకాశం లేకపోవడంతో అరగంటకోసారి మై దానాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. చివరికి రాత్రి 9.30 గంటలకు ఆరోసారి గ్రౌండ్ ను పరిశీలించిన అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అటు లక్నోలో కాలుష్య ప్రభావం కూడా తీవ్రంగా ఉండడం కలకలం రేపింది. ఆటగాళ్ళు చాలా మంది మాస్కులు ధరించే గ్రౌండ్‌లోకి వచ్చారు. రాత్రి 8 గంటల నుం చి మంచు తీవ్రత బాగా పెరిగింది.
నిజానికి అభిమానుల కోసం కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నైనా జరిపేందుకు అంపైర్లు ప్రయత్నించారు. దీని కోసం మంచు తీవ్రతను అంచ నా వేసేందుకు గ్రౌండ్ నలువైపులా బౌండరీల దగ్గరకు వెళ్లి బంతి కనిపిస్తుందా లేదా అన్నది పరిశీలించారు. పిచ్ పై కూడా చాలా సార్లు తిరిగి బంతి బ్యాటర్ కు, ఫీల్డర్లకు కనిపించే అవకాశం ఉందా అనే విషయాన్ని కూ డా పదేపదే పరిశీలించారు.
పొగమంచు అంతకంతకూ దట్టంగా కమ్ముకోవడంతో చేసేదేమి లేక మ్యాచ్‌ను రద్దు చేసారు. అం పైర్లకు కూడా నిర్ణయాలు తీసుకోవడం కష్టమయ్యే పరిస్థితి ఉండడం, రాత్రి సాగేకొద్దీ మంచు ప్రభావం పెరుగుతూ ఉండడంతో క్యాన్సిల్ చేయలేక తప్పలేదు. దీంతో ఈ మ్యాచ్ తోనే సిరీస్ గెలవాలన్న భారత్ ఆశ నెరవేరలేదు. కాగా ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో పుంజుకున్న సఫారీలు సిరీస్ సమం చేశారు.
అయితే మూడో టీ ట్వంటీ లో దుమ్మురేపిన టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఇప్పుడు నాలుగో మ్యా చ్ లోనూ గెలుద్దామనుకుంటే మ్యాచ్ రద్దయింది. దీంతో సిరీస్ ఫలితం అహ్మదాబాద్ లో తేలబోతోంది. శుక్రవారం జరిగే చివరి మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ సౌతాఫ్రికా విజ యం సాధిస్తే మాత్రం సిరీస్ సమమవుతుం ది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు ముందే వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ గాయంతో తప్పుకున్నాడు. చివరి మ్యాచ్‌కు కూడా అం దుబా టులో ఉండడం అనుమానంగానే ఉంది.