29-11-2025 12:00:00 AM
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
ములకలపల్లి /దమ్మపేట,నవంబర్ 28 (విజయక్రాంతి):దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలె వర్ధంతి వేడుకలను నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పూలే చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలె వెనుకబడిన, అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు.
సమాజంలో సమానత్వం విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఆశయంతో ఆయన చూపించిన మార్గం నేటి తరానికి ఎంతో ప్రేరణనిస్తుందని అన్నారు. గ్రామాల్లో విద్య మహిళా సాధికారత సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోవడం మనందరి బాధ్యత అని ఇదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.